Latest Andhra Pradesh job update one stop Centre Job Recruitment
➡️25 న అప్రెంటిషిప్‌కు మేళా డోన్ టౌన్ : స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 25వ తేదీ డీటీఎస్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన హుండాయ్ మోబీస్ సంస్థ వారు ఐటీఐ పాస్ అయిన అన్ని ట్రేడ్ విద్యార్థులకు అంప్రెటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రాయపరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ .12 వేలు వేతనం, ఉచిత భోజన వసతితో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు 25 తేదీ ఉదయం 9 గంటలకు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అప్రెంటిషిప్ మేళాలో పాల్గొన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
➡️ఎంపికైన అభ్యర్థికి నియామకపత్రాన్ని అందజేస్తున్న గంట్యాడ ఐసీడీఎస్ సీడీపీఓ ప్రసన్న విజయనగరం ఫోర్ట్ : జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఇటీవల ఐసీడీఎస్ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపికైన వారి జాబితాను గురువారం విడుదల చేశారు. జాబితా లను సంబంధిత సీడీపీఓ కార్యాలయాలకు పంపించారు . మైదాన ప్రాంతంలో 18 అంగన్ వాడీ కార్యకర్తల పోస్టులకు నోటఫికేషన్ ఇవ్వగా 12 మందిని, అంగన్వాడీ హెల్పర్ 175 పోస్టులకు 139 మందిని భర్తీ చేశారు. మినీ అంగన్వాడీ వర్కర్స్కు సంబంధించి 8 పోస్టులకు నోటపికేషన్ ఇవ్వగా ఏడుగురిని ఎం పిక చేశారు. ఐటీడీఏ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు 22 పోస్టులకు 22 మందిని ఎంపిక చేయగా, హెల్పర్ పోస్టులు 65 కు 51 భర్తీ చేశారు. మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 16 భర్తీచేయాల్సి ఉండగా, 8 పోస్టులకు అర్హులను ఎంపిక చేశారు.
➡️టైలరింగ్ లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు కడప కార్పొరేషన్ : కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, కెనరా బ్యాంక్ ఆర్ సెటీ ఆధ్వర్యంలో టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఎన్. నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21 వ తేది నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందని, 18-45 ఏళ్లలోపు నిరుద్యోగ గ్రామీణ ప్రాంత మహిళలు ఈ శిక్షణకు అర్హులని పేర్కొ న్నారు . ఆసక్తిగలవారు తమ ట్రైనింగ్ సెంటర్ ఈ మెయిల్‌కు తమ వివరాలను పంపవ చ్చన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవా రికి ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించబ డుతుందన్నారు. వివరాలకు 9440905478, 6302833546 నంబర్లను సంప్రదించవచ్చని వివరించారు.
➡️ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 22 న జాబ్స్ మేళా సూళ్లూరుపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 22 వ తేదీ శనివారం జాబ్ మేళాను నిర్వహించనున్నామని కళాశాల ప్రిన్సిపల్ ఎస్ఎల్బీ శంకరశర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకింగ్ సర్వీస్ లకు సంబంధించి కొల్లమాన్ సర్వీసెస్, విష్ణు కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో పనిచేసేందుకు జాబ్‌మేళాను నిర్వహిస్తున్నామని తెలి పారు. డిగ్రీ పూర్తయిన విద్యార్థులు, ఫైనలియ ర్లో ఉన్న విద్యార్థులు జాబ్‌మేళాకు అర్హులని తెలియజేశారు. పూర్తి వివరాలకు కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎం. యల్లమందరావును సంప్రదించవచ్చని, ఆయన ఫోన్ నంబర్ 9441230384 ను సంప్రదించాలని సూచిం చారు.
Join to Telegram more Jobs Details Click Here
ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి
===================
ముఖ్యమైన లింకులు:
➡️Notification Click Here
➡️Webpage Click Here