Anganwadi Teacher, Helper Jobs Requirement 2021 | Latest Government Jobs | Srikakulam Apply Offline

దరఖాస్తుల ఆహ్వానం శ్రీకాకుళం అర్బన్: నగరంలో ఖాళీగా ఉన్న అంగ వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ జి.జయదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలియజే శారు. అర్హులైన వివాహిత మహిళలు ఈనెల 1 వ తేదీ నుంచి 7 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఐసీడీఎస్ ప్రాజెక్టు, శ్రీకాకుళం అర్బన్ కార్యాలయానికి దరఖాస్తులు అందజేయాలని సూచించారు. నిబంధనల మేరకు వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. పోస్టులు: ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్, 7 వ వార్డు పరిధిలో అంగన్‌వాడీ కార్యకర్త -1 (ఓసీ-ఎక్స్ సర్వీస్ మెన్), పాదాలమ్మతల్లి, 6వ వార్డు పరిధిలో అంగన్‌వాడీ కార్యకర్త -1 (బీసీ- సీ), బర్మాకాలనీ, 9వ వార్డు పరిధిలో సహాయకురాలు -1 (ఎస్టీ), రైతుబజారు, 9 వ వార్డు పరిధిలో సహాయకురాలు -1 (ఓసీ – హెచ్ హెచ్), బలగవీధి, 27వ వార్డు పరిధిలో సహాయకురాలు -1 (ఓసీ), శ్రీశయనవీధి, 26 వ వార్డు పరిధిలో సహాయకురాలు -1 (ఎస్టీ), బర్మాకాలనీ, 9 వ వార్డు పరిధిలో అంగన్‌వాడీ కార్య కర్త -1 (ఓసీ), మహలక్ష్మీనగర్ -1, 16 వ వార్డు పరిధిలో అంగన్‌వాడీ కార్యకర్త -1 (ఎస్సీ).

WhatsApp Group Join Now
Telegram Group Join Now

➡️అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు

1. అభ్యర్థిని తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణురాలయి ఉండాలి.

2. తేదీ: 01.07.2021 నాటికి అభ్యర్థిని కనీస వయస్సు 21 సం, లు నిండి 35 సం,లు దాటి ఉండరాదు.

3. జనరల్ కేటగిరిలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు నోటిఫికేషన్ విడుదలైన నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.

4. అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి.

5.  అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామ పంచాయతీ లో నివసిస్తూ ఉండాలి.

6. ఎస్.సి., ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు 01.07.2021 నాటికి 21 – 35 సం. వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులే.

7. ఎస్.పి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి చెందిన అభ్యర్థినులు అర్హులు.

8. ఎస్.సి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే హ్యాబిటీషన్ కి చెందిన అభ్యర్థినులు అర్హులు.

9. ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి కు చెందిన అభ్యర్థినులు అర్హులు.

10. ఎస్.టి. కి కేటాయించబడిన అంగన్ వాడి కేంద్రాలకు అది హ్యాబిటీషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు.

11. మున్సిపాలిటీ పరిధి లో అప్లై చేసుకునేవారు. అదే వార్డ్ లో నివాసము కలిగిన అభ్యర్థినులు అర్హులు.

➡️ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు

      I. వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు .

 II. అంధత్వం ఉన్నప్పటికి (ESCORT) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు.

    III. కాళ్ళు, చేతులకు సంబందించిన అంగ వైకల్యం కలిగినప్పటికి పూర్వ ప్రాధమిక విద్యను నేర్పుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు .

➡️జతపరచవలసిన ధృవ పత్రాలు (Scanned Copies)

1. పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.

2. కుల దృవీకరణ పత్రం.

3. విద్యార్హత దృవీకరణ పత్రం (పదవ తరగతి మార్కుల జాబితా).

4. నివాసస్థల దృవీకరణ పత్రం.

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి దృవీకరణ పత్రం.

6. వితంతువు అయితే భర్త దృవీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

అర్హులైన వివాహిత మహిళలు ఈనెల 1 వ తేదీ నుంచి 7 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఐసీడీఎస్ ప్రాజెక్టు, శ్రీకాకుళం అర్బన్ కార్యాలయానికి దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

Those who want to download this Notification

Click on the link given below

========================

Important Links:

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page