Anganwadi Teacher, Helper Jobs | Latest Government Jobs | Sangareddy Nalgonda Suryapet District Anganwadi Jobs
తెలంగాణ ప్రభుత్వం మహిళా , శిశు , వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ , జిల్లా సంగారెడ్డి, సూర్యపేట, నల్గొండ నోటిఫికేషన్ సంఖ్య : 186 / A1 / SSPET / 2017 నోటిఫికేషన్ తేది : 11-08-2021 సంగారెడ్డి జిల్లాలోని ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు సదాశివపేట్,నారాయణ్ ఖేడ్, సూర్యపేట్ పరిధిలో ఖాళీగా ఉన్న (08) అంగన్ వాడి టీచర్ మినీ (10) అంగన్వాడీ టీచర్ మరియు (66) అంగన్ వాడి | ఆయా పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థులు నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి . ఖాళీలు మరియు | అర్హతలు కోరకు https://mis.tgwdcw.in లేదా https://wdcw.tg.nic.in వెబ్ సైట్ ని సందర్శించవచ్చు . ఇట్టి పోస్టులకు అభ్యర్థులు తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణురాలై ఉండాలి . వయస్సు తేది : 01-07-2021 నాటికి 21 సం . నీండి 35 సం . మించకుండా ఉండాలి మరియు SSC Memo , Caste సర్టిఫికెట్ , నివాస దృవీకరణ పత్రం , సదరం సర్టిఫికెట్ (దివ్యాంగులకు), అనాథ అయితే | అనాథ సర్టిఫికెట్ , వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రములు గెజిటెడ్ అధికారితో దృవీకరించి నోటిఫికేషన్ వెలువడిన తేది | నుండి తేది : 27-08-2021 సాయంత్రం 5.00 గం.లలోపు https://mis.tgwdcw.in లేదా https://wdcw.tg.nic.in | వెబ్ సైట్ లో మాత్రమే సమర్పించవలెను . ధృవీకరణ పత్రములు ఆన్ లైన్ నందు అప్ లోడ్ చేయనిచో అట్టి దరఖాస్తులు తిరస్కరించబడును . | ఇతర వివరముల కొరకు సంగారెడ్డి జిల్లా సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు అధికారులను సంప్రదించగలరు . ఈ నోటిఫికేషన్ రద్దు పరుచుటకు గాని , మార్పులు చేయుటకు గాని శ్రీయుత జిల్లా కలెక్టర్ / చైర్మన్ , సింగారెడ్డి గారికి పూర్తి అధికారం కలదు.
➡️అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు
1. అభ్యర్థిని తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణురాలయి ఉండాలి.
2. తేదీ: 01.07.2021 నాటికి అభ్యర్థిని కనీస వయస్సు 21 సం, లు నిండి 35 సం,లు దాటి ఉండరాదు.
3. జనరల్ కేటగిరిలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు నోటిఫికేషన్ విడుదలైన నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.
4. అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి.
5. అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామ పంచాయతీ లో నివసిస్తూ ఉండాలి.
6. ఎస్.సి., ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు 30.07.2021 నాటికి 21 – 35 సం. వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులే.
7. ఎస్.పి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి చెందిన అభ్యర్థినులు అర్హులు.
8. ఎస్.సి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే హ్యాబిటీషన్ కి చెందిన అభ్యర్థినులు అర్హులు.
9. ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి కు చెందిన అభ్యర్థినులు అర్హులు.
10. ఎస్.టి. కి కేటాయించబడిన అంగన్ వాడి కేంద్రాలకు అది హ్యాబిటీషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు.
11. మున్సిపాలిటీ పరిధి లో అప్లై చేసుకునేవారు. అదే వార్డ్ లో నివాసము కలిగిన అభ్యర్థినులు అర్హులు.
➡️ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు
I. వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు .
II. అంధత్వం ఉన్నప్పటికి (ESCORT) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు.
III. కాళ్ళు, చేతులకు సంబందించిన అంగ వైకల్యం కలిగినప్పటికి పూర్వ ప్రాధమిక విద్యను నేర్పుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు .
➡️జతపరచవలసిన ధృవ పత్రాలు (Scanned Copies)
1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.
2. కుల దృవీకరణ పత్రం.
3. విద్యార్హత దృవీకరణ పత్రం (పదవ తరగతి మార్కుల జాబితా).
4. నివాసస్థల దృవీకరణ పత్రం.
5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి దృవీకరణ పత్రం.
6. వితంతువు అయితే భర్త దృవీకరణ పత్రం.
7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
ఆన్ లైన్ లో దరఖాస్తుతో పాటు కావలసిన ధృవీకరణ పత్రాలు గెజిటెడ్ అధికారితో ధృవీకరించి తేది: 12.08.2021 తేది: 27.08.2021 సా. 5.00గం||ల లోపు http://wdcw.tg.nic.in లేదా http://mis.tgwdcw.in వెబ్ సైట్ ద్వారా సమర్పించవలెను.
పూర్తి వివరములకు సంబంధిత ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు కార్యాలయములను సంప్రదించగలరు. సం/- జిల్లా సంక్షేమాధికారి/ కన్వీనర్ మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ, నల్గొండ, సూర్యాపేట, నల్గొండ జిల్లా.
Those who want to download this Notification
Click on the link given below
========================
Important Links:
✅️Website Click Here
✅️ Download List of Vacant AWCs of Sangareddy Click Here
✅️Download List of Vacant AWCs of నల్గొండ టైమ్స్ అయిపోఇంది Click Here
✅️Download List of Vacant AWCs of Suryapet Click Here
✅️Download List of Vacant AWCs of Yadadri-Bhuvangiri Click Here
✅️Apply Online Click Here