TS Anganwadi Jobs Recruitment 2021 | Anganwadi Teacher, Helper Jobs

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని (11) ఐసిడిఎస్ ప్రాజెక్టుల కార్యాలయముల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్ వాడి టీచర్లు (13), ఆయాలు (52) మరియు మినీ అంగన్ వాడీ టీచర్లు (37) పోస్టులను భర్తీ చేయుటకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నవి. అర్హత, ఖాళీలు మరియు ఇతర వివరముల కొరకు http://wdcw.tg.nic.in లేదా http://mis.tgwdcw.in వెబ్ సైట్ నందు సందర్శించగలరు. మరియు పూర్తి వివరముల కొరకు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయములో సంప్రదించగలరు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

➡️అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు

1. అభ్యర్థిని తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణురాలయి ఉండాలి .

2. తేదీ : 01.07.2021 నాటికి అభ్యర్థిని కనీస వయస్సు 21 సం, లు నిండి 35 సం ,లు దాటి ఉండరాదు .

3. జనరల్ కేటగిరిలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు నోటిఫికేషన్ విడుదలైన నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.

4. అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి.

5. అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామ పంచాయతీ లో నివసిస్తూ ఉండాలి

6. ఎస్.సి., ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు 01.07.2021 నాటికి 21 – 35 సం . వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులే.

7. ఎస్.పి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి చెందిన అభ్యర్థినులు అర్హులు .

8. ఎస్.సి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే హ్యాబిటీషన్ కి చెందిన అభ్యర్థినులు అర్హులు .

9. ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి కు చెందిన అభ్యర్థినులు అర్హులు .

10. ఎస్.టి. కి కేటాయించబడిన అంగన్ వాడి కేంద్రాలకు అది హ్యాబిటీషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు .

11. మున్సిపాలిటీ పరిధి లో అప్లై చేసుకునేవారు . అదే వార్డ్ లో నివాసము కలిగిన అభ్యర్థినులు అర్హులు .

➡️ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు , వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు

      I. వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు .

     II . అంధత్వం ఉన్నప్పటికి (ESCORT) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు .

    III . కాళ్ళు , చేతులకు సంబందించిన అంగ వైకల్యం కలిగినప్పటికి పూర్వ ప్రాధమిక విద్యను నేర్పుటకు గాని , పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు .

➡️జతపరచవలసిన ధృవ పత్రాలు ( Scanned Copies)

1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం .

2. కుల దృవీకరణ పత్రం .

3. విద్యార్హత దృవీకరణ పత్రం ( పదవ తరగతి మార్కుల జాబితా ) .

4. నివాసస్థల దృవీకరణ పత్రం .

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి దృవీకరణ పత్రం .

6. వితంతువు అయితే భర్త దృవీకరణ పత్రం .

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్ .

దరఖాస్తుతో పాటు తగిన ధ్రువీకరణ పత్రములు గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించుకుని తేదీ 16.07.2021 నుండి 31.07.2021 సాయంత్రం 5:00 గంటలలోపు http://wdcw.tg.nic.in లేదా http://mis.tgwdcw.in వెబ్ సైట్ నందు ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకొనగలరు . ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడును . దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయము నందు తేది 02.08.2021 నుండి 06.08.2021 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కూటినీ చేయించుకొ నగలరు. లేనిచో దరఖాస్తులు పరిగణలోనికి తీసుకొనబడవు.

నోటిఫికేషన్ రద్దు చేయుటకు కానీ మరియు మార్పులు చేయుటకు కానీ శ్రీయుత జిల్లా కలెక్టరు, భద్రాద్రి కొత్తగూడెం గారికి పూర్తి అధికారం కలదు

Those who want to download this Notification

Click on the link given below

========================

Important Links:

✅️Website Click Here

✅️Notification Click Here

✅️Apply Online Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page