ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వం పత్రికలో ప్రచురించవలసిన నోటిఫికేషన్ జిల్లా సంక్షేమాధికారిణి , మహిళా , శిశు, వికలాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ సమగ్ర శిశు అభివృద్ధి సేవ పథకం
ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్ వాడి టీచర్లు , ఆయాలు మరియు మినీ అంగన్ వాడి టీచర్లు పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్ధినుల నుంచి దరఖాస్తులు కోరుతూ నేటిఫికేషన్ విడుదల చేయడం – గురించి . … గుంటూరు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఐ.సి.డి.యస్ . ప్రాజెక్టు కార్యాలయ పరిధిలోని ఖాళీగా ఉన్న అంగన్ వాటి పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థినుల నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరబడుతున్నాయి . వివిధ ఖాళీలు మరియు వాటి అర్హతల కు సంబందించిన పూర్తి వివరాల కోసం ఈ http://wdcw.tg.nic.in వెబ్ సైట్ ను సందర్శించాలి
➡️అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు
1. అభ్యర్థిని తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణురాలయి ఉండాలి .
2. తేదీ : 01.07.2021 నాటికి అభ్యర్థిని కనీస వయస్సు 21 సం , లు నిండి 35 సం ,లు దాటి ఉండరాదు .
3. జనరల్ కేటగిరిలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు నోటిఫికేషన్ విడుదలైన నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి .
4. అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి.
5. అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామ పంచాయతీ లో నివసిస్తూ ఉండాలి
6. ఎస్.సి., ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు 01.07.2021 నాటికి 21 – 35 సం . వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులే.
7. ఎస్.పి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి చెందిన అభ్యర్థినులు అర్హులు .
8. ఎస్.సి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే హ్యాబిటీషన్ కి చెందిన అభ్యర్థినులు అర్హులు .
9. ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి కు చెందిన అభ్యర్థినులు అర్హులు .
10. ఎస్.టి. కి కేటాయించబడిన అంగన్ వాడి కేంద్రాలకు అది హ్యాబిటీషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు .
11. మున్సిపాలిటీ పరిధి లో అప్లై చేసుకునేవారు . అదే వార్డ్ లో నివాసము కలిగిన అభ్యర్థినులు అర్హులు .
➡️ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు , వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు
I. వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు .
II . అంధత్వం ఉన్నప్పటికి ( ESCORT ) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు .
III . కాళ్ళు , చేతులకు సంబందించిన అంగ వైకల్యం కలిగినప్పటికి పూర్వ ప్రాధమిక విద్యను నేర్పుటకు గాని , పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు .
➡️ అంగన్వాడీ ఉద్యోగాలకు శాలరీ
•అంగన్వాడీ టీచర్ నెల జీతం 11,000/-pm
•అంగన్వాడీ మినీ టీచర్, హెల్పర్ కు నెల జీతం 7000/-pm
➡️జతపరచవలసిన ధృవ పత్రాలు ( Scanned Copies )
1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం .
2. కుల దృవీకరణ పత్రం .
3. విద్యార్హత దృవీకరణ పత్రం ( పదవ తరగతి మార్కుల జాబితా ) .
4. నివాసస్థల దృవీకరణ పత్రం .
5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి దృవీకరణ పత్రం .
6. వితంతువు అయితే భర్త దృవీకరణ పత్రం .
7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్ .
దరఖాస్తుతో పాటు తగు దృవీకరణ పత్రాలు గెజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ చేయించి తేది : 17.07.2021 సాయంత్రం 5.00 గం.ల లోపు ఈ క్రింద తెలిపిన ఆన్లైన్ లింక్ ద్వారా సమర్పించాలి .
========================
✅️Official Webpage Click Here
✅️Notification pdf Click Here
✅️Apply Online Click Here